తెలంగాణ

telangana

ETV Bharat / crime

రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఏడేళ్ల బాలుడు మృతి - విశాఖలో ఏడేళ్ల బాలుడి మృతి

A boy died in Bus Accident: తల్లితో రోడ్డు దాటుతున్న ఓ బాలుడిని ఫార్మాసిటీకి చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందాడు. ఉక్కునగరం సెక్టర్‌-8 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బాలుడి మృతిపై ఆందోళన చెలరేగింది. ఉక్కునగరంలోకి ఫార్మా బస్సుల ప్రవేశంపై.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు.

A boy died in Bus Accident
విశాఖలో బాలుడి మృతి

By

Published : Dec 20, 2022, 7:09 PM IST

విశాఖలో విషాదం.. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఏడేళ్ల బాలుడు మృతి

A boy died in Bus Accident: ఆంధ్రప్రదేశ్​లోని విశాఖలో విషాదం చోటుచేసుకుంది. ఉక్కునగరం సెక్టర్‌-8 వద్ద తల్లితో కలిసి రోడ్డు దాటుతున్న ఏడేళ్ల బాలుడిని బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో ఫార్మాసిటీకి చెందిన బస్సు బాలుడిని ఢీకొట్టింది. ఉక్కునగరంలోకి ఫార్మా బస్సుల ప్రవేశంపై.. ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. బాలుడి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌ డ్యూటీ, పాఠశాలల సమయాల్లో ఫార్మా బస్సులు ఉక్కునగరంలోకి అతి వేగంగా ప్రవేశిస్తున్నాయంటూ.. ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details