నేరం రుజువయ్యే దాకా ఎంత పెద్ద కేసైనా అతడిని నిందితుడిగానే మన న్యాయవ్యవస్థ (Judiciary) పరిగణిస్తుంది. అతడి ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా కాపాడుతుంది. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది పోలీసుల తీరు (telangana police Enthusiasm) అందుకు భిన్నంగా ఉంటోంది. చిన్న చిన్న దొంగతనాల కేసుల్లోనూ... విచారణ పేరుతో నిందితులను చావబాదుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన మరియమ్మ ఘటన (mariyamma lockup death) ఈ పరిస్థితిని తెలియజేస్తే... ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరో ఘటన ఖాకీల కాఠిన్యానికి అద్దం పడుతోంది.
పోలీసుల అత్యుత్సాహం
ఈనెల 4న ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరులోని బెల్టు షాపులో... 10వేల నగదు, 40 క్వార్టర్ సీసాల చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ కేసు విచారణలో స్థానిక ఎస్సై లింగం(si lingam), సిబ్బంది వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో కేవలం అనుమానితుడిగా ఉన్న ఓ యువకుడిని తీసుకొచ్చి చితకబాదిన తీరు... ఎస్సై అత్యుత్సాహానికి (si lingam Enthusiasm), అరాచక వ్యవహారానికి అద్దం పడుతోంది. లింగం వ్యవహారశైలి ఆది నుంచీ ఇలాగే ఉందని... సూర్యాపేట జిల్లాలోని పలువురు పోలీసు అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌తో పాటు సూర్యాపేట జిల్లాలోని నూతనకల్, నాగారంలో పనిచేసినప్పుడూ... వ్యవహారశైలితో ఎస్సై వివాదాస్పదమయ్యారు. నాగారంలో ఒక వ్యక్తిని దారుణంగా కొట్టడంతో... అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అక్కడి ప్రజల ఆందోళనతో లింగంను వీఆర్‌కు పంపించారు. కొన్ని నెలల తర్వాత ఆత్మకూరులో పోస్టింగ్ ఇచ్చారు. బుధవారం మళ్లీ యువకుడిని చితకబాదిన ఘటన.. అతడి సస్పెన్షన్‌కు (SI lingam suspend news) దారి తీసింది.
పోలీసుల తీరుపై ఆరోపణలు
ఒక్క ఎస్సై లింగం మాత్రమే కాదు... ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేకమంది పోలీసుల ( nalgonda police) తీరుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. లింగం తరహా వ్యవహారశైలితో ఈ మధ్య కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 మంది వరకు పోలీసులపై వేటు పడింది. అక్రమ మద్యం సరఫరా, స్థిరాస్తి వివాదాలు, ఇసుక రీచ్‌ల వంటివి నిర్వహిస్తున్న వారికీ కొంతమంది అధికారులు అండగా నిలుస్తున్నారనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సంబంధిత కథనాలు: