తెలంగాణ

telangana

కుమారుల తగాదాలు.. తల్లిదండ్రుల ఆత్మహత్య!

By

Published : May 2, 2021, 12:20 PM IST

పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను కాపాడాల్సిన వారే... వారి మరణానికి కారణమయ్యారు. అనారోగ్యంతో ఉన్న వారి బాగోగులు చూసుకోవాల్సింది పోయి.. భూ తగాదాలు పెట్టుకున్నారు. అవి చూసిన దంపతులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఈ హృదయవిదారక ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది.

Parents are suicide at dharur, dharur jagtial news today
కుమారుల తగాదాలు.. తల్లిదండ్రుల ఆత్మహత్య!

జగిత్యాల మండలం ధరూర్‌లో విషాదం నెలకొంది. కొడుకులు పట్టించుకోకపోవటం, అనారోగ్యం కారణంగా వృద్ద దంపతులు ఉరి వేసుకుని బల్వన్మరణానికి పాల్పడ్డారు. అదే గ్రామానికి చెందిన వక్రాల హన్మంతరావు అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం అయ్యారు. ఆయన భార్య సులోచన సేవలు చేస్తోంది.

వారికి ఇద్దరు కొడుకులున్నప్పటికీ అనారోగ్యంతో ఉన్న వారిని పట్టించుకోవడం లేదు. అంతేగాక కుమారులు భూ పంపిణీ విషయంలో తాగాదాలు పడటం చూసిన వృద్ద దంపతులు తనువు చాలించారు. మంచానికే పరిమితమైన హన్మంతరావుకు ఉరివేసి, ఆమె ఉరి వేసుకున్నట్లు సమాచారం. జగిత్యాల రూరల్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి:అగ్ని ప్రమాదం.. సుమారు 15 లక్షల నష్టం

ABOUT THE AUTHOR

...view details