తెలంగాణ

telangana

ETV Bharat / crime

MOTHER MURDER: రూ. 200ల కోసం.. తల్లిని గొడ్డలితో నరికి చంపిన తనయుడు - మంచిర్యాల జిల్లాలో తల్లిని చంపిన కొడుకు

Son killed mother: మద్యానికి బానిసైన కసాయి కొడుకు.. కన్నతల్లిని కడతేర్చిన ఘటన ఇది. మద్యం కోసం 200 రూపాయలు తల్లి ఇవ్వనందుకు గొడ్డలితో తలపై మోది కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్​లో జరిగింది.

MOTHER MURDER
MOTHER MURDER

By

Published : Feb 20, 2022, 3:39 PM IST

Son who killed mother in mancherial district: మద్యానికి బానిసైన ఓ కుమారుడు రూ. 200 కోసం కన్నతల్లినే హతమార్చిన ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానిక రాజీవ్‌నగర్‌కు చెందిన కడమండ సత్తమ్మ (65) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు చంద్రశేఖర్‌ మద్యానికి బానిసయ్యాడు. శనివారం డబ్బుల కోసం తల్లి సత్తమ్మను వేధించాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో కోపానికి గురైన చంద్రశేఖర్‌ గొడ్డలితో తల్లిపై దాడి చేశాడని ఎస్సై గంగారం తెలిపారు.

చంద్రశేఖర్‌

ఈ ఘటనలో సత్తమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు చంద్రశేఖర్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కూతురు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ఇదీ చూడండి:Inter Student Suicide : ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదేనా..!

ABOUT THE AUTHOR

...view details