తెలంగాణ

telangana

ETV Bharat / crime

Software Employee Died: విద్యుత్ తీగ తెగిపడింది.. ప్రాణం తీసింది..

ఉత్సాహంగా గణేశ్​ నిమజ్జనం సాగుతోంది. అందరూ ఉల్లాసంగా పాల్గొంటూ డప్పు చప్పుళ్లుకు స్టెప్పులేస్తూ ముందుకుసాగుతున్నారు. శోభాయాత్రలో మధ్యలో వచ్చిన ఓ వ్యక్తి మళ్లీ పాల్గొనేందుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆయనకు ఏం తెలుసు?.. అక్కడ తెగిపడ్డ విద్యుత్ తీగ అతని పాలిట మృత్యుపాశమవుతుందని. కొత్తూరులో జరిగిన ఈ ఘటన స్థానికులను విషాదంలోకి నెట్టింది.

Software Employee Died
సాఫ్ట్​వేర్ ఉద్యోగి మృతి

By

Published : Sep 20, 2021, 3:55 PM IST

అర్ధరాత్రి సమయం, పైగా జోరుగా వర్షం కురుస్తోంది. అందులోనే కరెంటు తీగ తెగిపడింది. ఎవరూ కూడా దానిని గమనించలేదు. అది అలా గాలిలో వేలాడుతూనే ఉంది. అదే సమయంలో శోభాయాత్రలో పాల్గొనడానికి వెళుతున్న వ్యక్తికి అది తగిలింది. అప్పటిదాకా వినాయక నిమజ్జనంలో హుషారుగా పాల్గొన్న ఆ వ్యక్తి విద్యుత్​ షాక్ తగిలి వ్యక్తి మృతిచెందాడు. (Software Employee Died) ఈ ఘటన హనుమకొండ జిల్లాలో జరిగింది. కొత్తూరు జెండా వద్ద కురిమిండ్ల సాయి... అర్ధరాత్రి 2 గంటల సమయంలో తెగి ఉన్న కరెంటు వైరు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. అంతకుముందు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్​పై తీసుకెళ్తుండగా కరెంటు వైరు తెగి కిందపడిపోయింది.

ఇది గమనించని కురిమిండ్ల సాయి... దానికి తగిలి అక్కడికక్కడే (Software Employee Died)చనిపోయాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కురిమిండ్ల సాయి పూణేలో సాఫ్ట్​వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే కరోనా కారణంగా కొత్తూరు జెండాలోని ఇంటి వద్దే ఉంటూ జాబ్ చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది.

నిమజ్జనంలో పాల్గొనడానికి వెళ్తుండగా కరెంట్ షాక్..

అర్ధరాత్రి కావడం... పైగా జోరుగా వర్షం కురవడం, గాలి వల్ల కరెంటు వైరు తెగి పడటం... గమనించని సాయి షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడం అతని బంధుమిత్రులకు తీవ్ర విషాదం మిగ్చిలింది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details