Road Accident: హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. గౌలిదొడ్డిలో ఉంటున్న జయకృష్ణ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున ఆఫీసుకు తన ద్విచక్రవాహనంపై బయలు దేరారు. ఐఎస్‌బీ వద్దకు రాగానే ఎదురుగా ఉన్న డివైడర్ను ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే అతన్ని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరిలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Road Accident: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం - హైదరాబాద్ తాజా నేేర వార్తలు
Road Accident: గచ్చిబౌలి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదం