ఏపీ కర్నూలులో ఈనెల 14న జరిగిన బ్యాంకు మేనేజర్ మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేశ్ తెలిపారు. పద్నాలుగో తేదీ సాయంత్రం సంతోష్‌నగర్ కాలనీలో.. ఇంటిముందు రోడ్డుపై కారు అడ్డంగా ఉందని మహేశ్వర్ రెడ్డి హారన్ కొట్టగా.. వాగ్వాదం జరిగింది.
murder case: హత్య కేసులో ఏడుగురు అరెస్టు - bank manager murder case update news
ఏపీలో.. ఈ నెల 14న కర్నూలులో జరిగిన బ్యాంకు మేనేజర్ మహేశ్వర్ రెడ్డి హత్య కేసులో పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన మరణాయుధాలతో పాటు ఓ బొలెరో వాహనం స్వాధీనం చేసుకున్నారు.
హత్య కేసు
ఈ విషయంలో పగను పెంచుకున్న చంద్రకాత్.. మరో ఆరుగురు కలిసి అదే రోజు రాత్రి ఈ హత్యకు పాల్పడ్డారు. వేట కొడవళ్లు, పిడి బాకులతో క్రూరంగా హతమార్చారు. పోలీసులు నిందితుల వద్ద నుంచి.. మరణాయుదాలు, ఓ బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:Gutka business: ఓ వైపు కిరాణా స్టోర్.. మరోవైపు గుట్కా బిజినెస్