కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సుమారు ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.15,000 నగదు ఎత్తుకెళ్లారు.
కౌటాల మండలానికి చెందిన చంచల్ బిశ్వాస్ వృత్తిరీత్యా కాగజ్నగర్ పట్టణంలోని ఈద్గా కాలనీలో కిరాయికి ఉంటున్నాడు. నాలుగు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి.. సొంతూరుకు వెళ్లాడు. శనివారం ఉదయం ఇంటి యజమాని శ్రీనివాస్ వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. వెంటనే చంచల్ బిశ్వాస్కు సమాచారం అందించాడు.