మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ జలాశయం వద్ద ఇసుకను ఫిల్టర్ చేసి పలువురు అక్రమంగా లారీల్లో తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల పోలీసులు దాడి చేసి మూడు ఇసుక లారీలను పట్టుకున్నారు. జడ్చర్ల సీఐ వీరస్వామి, ఎస్సై షంషుద్దీన్ దాడుల్లో పాల్గొని లారీ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలు పట్టివేత - మహబూబ్నగర్ జిల్లా ఉదండాపూర్
మహబూబ్నగర్ జిల్లా ఉదండాపూర్ జలాశయం వద్ద ఇసుకను ఫిల్టర్ చేసి కొందరు దుండగులు అక్రమంగా లారీల్లో తీసుకెళ్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు లారీలను పట్టుకున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు లారీలు పట్టివేత