కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన పటిక, నిషేధిత గుట్కాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
అక్రమంగా నిల్వ ఉంచిన పటిక, నిషేధిత గుట్కా స్వాధీనం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సలుగుపల్లిలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన పటిక, నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
బెజ్జూరు మండలం సలుగుపల్లిలో గుడుంబా తయారీలో వినియోగించే పటిక అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సలుగుపల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన సుమారు 105 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారు. మరో కిరాణ దుకాణంలో రూ.4,500 విలువ గల నిషేధిత గుట్కాను పట్టుకున్నారు. ఈ మేరకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి స్థానిక పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు సీఐ రాణాప్రతాప్ తెలిపారు. అక్రమ వ్యాపారాలు చేసినా.. చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీచూడండి:కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి