జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు, మల్దకల్, ధరూర్, గద్వాల మండలాల్లో అధికారుల దాడుల్లో భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. జిల్లా కేంద్రంలోని కొండపల్లి రోడ్డులోని ప్రముఖ ఆర్గనైజర్‌కు సంబంధించిన… రమ్య ఇండస్ట్రీలో 72 క్వింటాళ్లు, గట్టు మండలంలోని రాయపురంలో ఒక క్వింటా, గద్వాల మండలంలోని గుంటిపల్లి గ్రామంలో 1.5 క్వింటాళ్లు, మల్దకల్ మండలంలోని ఓ గ్రామంలో 1.6 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నకలీ పత్తి విత్తనాల విలువ కోట్లల్లో ఉంటుందని పేర్కొన్నారు.
83 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత - 83 క్వింటాళ్ల విఫల పత్తి విత్తనాలు
జోగులాంబ గద్వాల జిల్లాలోని రమ్య ఇండస్ట్రీలో నకిలీ పత్తి విత్తనాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో సుమారు 83 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను వ్యవసాయ, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
83 క్వింటాళ్ల విఫల పత్తి విత్తనాలు పట్టివేత
జిల్లాలో భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలు ఉన్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. వరుస దాడుల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడుతుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కేసులు నమోదు చేశామని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:BLACK MARKET: బ్లాక్‌ఫంగస్ డ్రగ్‌ను అమ్ముకున్న ప్రభుత్వ వైద్యుడు