తెలంగాణ

telangana

ETV Bharat / crime

సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. ప్రధాన సూత్రధారి అతడే..!

సికింద్రాబాద్ అల్లర్ల కేసు
సికింద్రాబాద్ అల్లర్ల కేసు

By

Published : Jun 20, 2022, 7:18 PM IST

Updated : Jun 20, 2022, 8:29 PM IST

19:13 June 20

సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు

సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టు

Secunderabad Agnipath: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి కామారెడ్డి వాసి మధుసూదన్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. పక్కా ప్రణాళికతోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు సికింద్రాబాద్ అల్లర్ల కేసు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది..‘‘సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం సృష్టించాలనే కుట్రతోనే యువకులందరూ మూకుమ్మడిగా రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకొచ్చారు. లోకో ఇంజిన్లకు నిప్పు పెట్టాలని ఆందోళనకారులు ప్రయత్నిస్తున్న క్రమంలో ఎంత నచ్చజెప్పినా వినలేదు. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వుతూ లోకో ఇంజిన్ల వైపు వస్తుండడంతో కాల్పులు జరపాల్సి వచ్చింది. లోకో ఇంజిన్‌లో 4వేల లీటర్ల హెచ్‌ఎస్‌డీ ఆయిల్‌ ఉంది. 3వేల లీటర్ల సామర్థ్యం ఉన్న లోకో ఇంజిన్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టి ఉంటే ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 20 రౌండ్ల కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో దామోదర్ రాకేష్ మృతి చెందగా 12 మంది గాయపడ్డారు. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో చాలా మంది పోలీసు అధికారులు గాయపడ్డారు.

ఏ1గా కామారెడ్డి వాసి..పలు వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న యువకులు, 17వ తేదీ విధ్వంసానికి కుట్ర పన్ని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు పెట్రోల్ బాటిళ్లు, కర్రలతో చేరుకున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో గేట్ నెంబర్ 3 నుంచి ప్లాట్‌ఫాం-1కి చేరుకొని ఆందోళనకు దిగారు. రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు, ప్లాట్‌ఫాంపై ఉన్న స్టాళ్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత మూడు రైళ్లలోని నాలుగు బోగీలకు నిప్పు పెట్టారు. వాట్సాప్‌ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తేలింది. ఈ అల్లర్లకు సంబంధించి 56 మందిని నిందితులుగా చేర్చి, వారిలో 46 మందిని ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ఈ కేసులో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన మధుసూదన్‌ను ఏ1గా తేల్చాం. డిఫెన్స్ అకాడమీలకు చెందిన కొంతమంది నిర్వాహకులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినట్లు నిర్ధారణకు వచ్చాం. ఈ విధ్వంసం వల్ల రూ.20 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సికింద్రాబాద్ రైల్వే డీఎస్పీ నర్సయ్య 18 మంది సాక్షులను విచారించారు’’ అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఇవీ చూడండి..

Last Updated : Jun 20, 2022, 8:29 PM IST

ABOUT THE AUTHOR

...view details