తెలంగాణ

telangana

ETV Bharat / crime

కూల్​డ్రింక్​ అనుకుని పురుగుల మందు తాగిన విద్యార్థినులు

Students Who Drank Pesticide In School: అభం.. శుభం తెలియని ముగ్గురు చిన్నారులు పాఠశాలలో ఓ శీతలపానీయం బాటిల్‌లోని పురుగుల మందు తాగి అవస్థతకు గురయ్యారు. ఈ ఘటన ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలం ఓ ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. వారిని చికిత్స నిమిత్తం ద్విచక్రవాహనంపై ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించిన వైద్యులు ప్రాణపాయం నుంచి బయటపడ్డారని 24 గంటల వరకు పరిశీలించిన అనంతరం ఇంటికి పంపిస్తామని తెలిపారు.

Students Who Drank Pesticide In School
Students Who Drank Pesticide In School

By

Published : Feb 3, 2023, 9:56 AM IST

Students Who Drank Pesticide In School: అభం.. శుభం తెలియని ముగ్గురు విద్యార్థినులు పాఠశాలలో ఓ శీతలపానీయం బాటిల్‌లో ఉన్న పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం కేశవాపూర్‌ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల కథనం ప్రకారం.. నాలుగో తరగతి చదువుతున్న ఆరెపల్లి అక్షర(9), సాదు అఖిల(9), ఐదో తరగతికి చెందిన సాదు ఐశ్వర్య(10) ఏడుస్తుండగా తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాజేశ్‌కుమార్‌కు తెలియజేశారు.

ఎందుకు ఏడుస్తున్నారని ఆయన వారిని ప్రశ్నించగా.. అక్షర బ్యాగులోని బాటిల్‌లో ఉన్న తెల్లని ద్రావణాన్ని ముగ్గురం కలిసి తాగినట్లు చెప్పారు. ఆ బాటిల్‌ను పురుగుల మందు వాసన రావడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ములుగు ఏరియా ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లారు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని 24 గంటల వరకు పరిశీలించిన అనంతరం ఇంటికి పంపిస్తామని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

బ్యాగులోకి ఎలా వచ్చింది..?:నాలుగో తరగతికి చెందిన విద్యార్థిని బ్యాగులోకి పురుగుల మందు డబ్బా ఎలా వచ్చిందనేది తెలియాల్సి ఉంది. ఇతరులు ఎవరైనా ఇచ్చారా? లేక ఉపాధ్యాయులెవరైనా విద్యార్థినులను బెదిరింపులకు గురి చేశారా? తెలిసి తాగారా తెలియక తాగారా అనే ప్రశ్నలు గ్రామస్థుల్లో వ్యక్తమవుతున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details