తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడి పైశాచికత్వం.. పాఠశాల ఎదుట ధర్నా

HM Harassed Students: ఆయన ఓ స్కూల్​కు హెడ్​ మాస్టర్​. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో ఉన్నా.. గుణగణాల్లో మాత్రం కీచకుడిని మించిపోయాడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సింది పోయి.. పాఠశాలలో చేయకూడని పనులు చేస్తూ.. వారితో చేయిస్తూ నీచానికి దిగజారారు. అంతే కాకుండా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది సహించలేని చిన్నారులు.. తల్లిదండ్రులతో మొరపెట్టుకున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఘటనలివి. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు.. స్కూల్​ ఎదుట బైఠాయించారు.

hm harassed students
విద్యార్థినీ విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడి పైశాచికం

By

Published : Feb 22, 2022, 4:13 PM IST

HM Harassed Students: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లిలో మండల పరిషత్​ ప్రాథమిక పాఠశాల ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సేపూరి నరసింహ.. వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నాడని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు. గత కొద్ది కాలంగా విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టడం, వారితో బయట నుంచి సిగరెట్లు, మద్యం తెప్పించుకోవడం లాంటివి చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా బాలికలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వెలిబుచ్చారు. ఈ వేధింపులు భరించలేక ఇవాళ విద్యార్థులంతా మాకు ఈ హెడ్​మాస్టర్ వద్దంటూ ఆందోళనకు దిగారు.

సస్పెండ్​ చేయాలి

ఆందోళన చేపడుతున్న సమయంలో పాఠశాలలో హెడ్​ మాస్టర్​ లేకపోవడంతో ఎమ్​ఈవో ఆదేశాలతో.. గుండ్రంపల్లి ప్రధానోపాధ్యాయుడు వచ్చి తల్లిదండ్రులకు సర్ధిచెప్పారు. విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రధానోపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనకు వినతి పత్రం సమర్పించారు.

ఇదీ చదవండి:ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్... పీఆర్సీ బకాయిలు చెల్లింపు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details