వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో యథేచ్ఛగా ఇసుక అక్రమ దందా నడుస్తున్నా.. అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. పక్కనే ఉన్న కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూర్, కళ్లుపల్లి, జంగంపల్లి గ్రామాలకు చెందిన ఇసుక వ్యాపారస్థులు ముల్కనూర్ను అడ్డాగా చేసుకొని.. ఇసుక అక్రమ రవాణా వ్యాపారం కొనసాగిస్తున్నారు. గ్రామంలో ఇసుక డంపులను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు.
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా.. పట్టించుకోని అధికారులు - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
వరంగల్ అర్బన్ జిల్లా ముల్కనూరులో ఇసుక అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ.. ఇసుకాసురులు లక్షల్లో దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఇసుక వ్యాపారస్థుల ఈ అక్రమ దందా మూడు పువ్వులు- ఆరు కాయలు అన్న చందంగా సాఫీగా సాగిపోతోంది.
ఇసుక అక్రమ రవాణా
ఇసుక అక్రమ దందా పట్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు, ఇసుక వ్యాపారస్థులు కుమ్మక్కై అక్రమ దందాకు పాల్పడుతున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి.. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.
ఇవీ చదవండి:కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా