కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలంలో భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ స్పృహ తప్పడంతో రోడ్డు పక్కనే గల పత్తి చేలోకి బస్సు దూసుకెళ్లింది. మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కాగజ్‌నగర్ నుండి 40 మంది ప్రయాణికులతో బయలుదేరింది. బురదగుడాలోని వినయ్ మణికంఠ ఆసుపత్రి సమీపంలో డ్రైవర్ స్పృహ కోల్పోవడంతో అదుపుతప్పిన బస్సు సమీప పత్తి చెేలోకి దూసుకెళ్లింది.
Accident: పత్తి చేలోకి దూసుకెళ్లిన బస్సు... 40మంది ప్రయాణికులు... - కుమురం భీం జిల్లా వార్తలు
కుమురం భీం జిల్లాలో భారీ ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ స్పృహ తప్పడంతో రోడ్డు పక్కనే గల పత్తి చేలోకి బస్సు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో 40మంది ప్రయాణికులు బస్సులో ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.
RTC Bus Accident
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పత్తి చేలోకి సుమారు 100 మీటర్ల దూరం వరకు దూసుకెళ్లి కాలువలో కూరుకుపోయింది. డ్రైవర్ గణేశ్‌తో సహా ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదని కండక్టర్ సత్యనారాయణ తెలిపారు. ప్రమాద సమయంలో బస్సువేగం తక్కువగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:Cyber Crimes in Telangana : అప్పు ఇస్తామంటూ.. నిండా ముంచేస్తున్నారు