drugs seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం - డీఆర్‌ఐ అధికారులు
08:23 June 21
drugs seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు(drugs seized) పట్టుబడ్డాయి. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తి వద్ద డీఆర్‌ఐ అధికారులు మూడు కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన హెరాయిన్ విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
టాంజానియా వాసి అయిన జాన్ విలియమ్స్ ప్రస్తుతం డీఆర్‌ఐ అధికారుల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెలలో పెద్దమొత్తంలో అధికారులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. ఈ నెల 5న జాంబియాకు చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళల నుంచి రూ.78 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం(drugs seized) చేసుకున్నారు.
ఇదీ చూడండి:ACCIDIENT: రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి