తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rowdy sheeter murder at tadepalligudem: రౌడీషీటర్​, అతని అనుచరుడి హత్య..! - telangana latest updates

Rowdy sheeter murder at tadepalligudem: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో ఓ రౌడీషీటర్‌, అతని అనుచరుడు దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి పాత పైవంతెన కింద ఉన్న శ్రీనివాస లాడ్జి వద్దకు వెళ్లగా.. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు.

Rowdy sheeter murder at tadepalligudem, murder case news
రౌడీషీటర్​, అతని అనుచరుడి హత్య..!

By

Published : Jan 2, 2022, 12:38 PM IST

Rowdy sheeter murder at tadepalligudem: నూతన సంవత్సరం తొలి రోజునే పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో జరిగిన జంట హత్యల ఘటన కలకలం రేపింది. పట్టణంలోని కొబ్బరితోటకు చెందిన వై.సూర్యనారాయణ(47), శ్రీదేవిపుంతకు చెందిన పప్పుల దొరబాబులు(45).. లారీ డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి వారిద్దరూ మద్యం తాగేందుకు ద్విచక్ర వాహనంపై పాత పైవంతెన కింద ఉన్న శ్రీనివాస లాడ్జి వద్దకు వెళ్లారు. లోపలికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి, కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పరారయ్యారు. ఈ ఘటనలో దొరబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. రక్తపుమడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సూర్యనారాయణను స్థానికులు అంబులెన్సులో ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. ఈమేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

నిందితులు 45 రోజులుగా లాడ్జిలోనే...

ఘటనా స్థలంలో పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. హత్యకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులు గత 45 రోజులుగా లాడ్జిలోనే ఉంటున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితులు కూడా లారీ ఫీల్డ్‌కు చెందిన వారుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన దొరబాబుపై రౌడీ షీటు ఉందని డీఎస్పీ శ్రీనాథ్‌ వెల్లడించారు. గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, పలు హత్యాయత్నం కేసులు ఉన్నాయని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్యచేసి ఉండొచ్చని భావిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:Lover suicide in Hyderabad : ప్రియురాలి ఎడబాటు భరించలేక.. ప్రియుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details