నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం రాత్రి మండలకేంద్రంలోని నాలుగు దుకాణాల్లో చొరబడి వస్తువులు, నగదును అపహరించుకుపోయారు. రూ.18 వేల విలువైన వస్తువులు, రూ.72 వేల నగదును ఎత్తుకెళ్లారు.
నాలుగు దుకాణాల్లో చోరీ.. నగదు, వస్తువులు అపహరణ - నవీపేట దుకాణాల్లో దొంగతనం
నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగింది. నాలుగు దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాల్లో సంబంధిత దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.
నవీపేటలో దొంగతనం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:వందకు బదులు రూ.200 పెట్రోల్: బంక్ వర్కర్‌పై దాడి