హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఇంద్రప్రస్థ కాలనీలో మూడంతస్తుల భవనంలోని మూడు అంతస్థుల్లో చోరీ జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఇంటిలోని మూడు ఫ్లోర్లలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దుండగులు తాళాలు పగులకొట్టి లోనికి ప్రవేశించి చోరీకి పాల్పడి పరారయ్యారు.
Robbery: పట్ట పగలు... మిట్ట మధ్యాహ్నం.. మూడిళ్లల్లో చోరీ - తెలంగాణ వార్తలు
పట్టపగలు మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్లో ఓ భవనంలోని మూడు ఫ్లోర్లలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అందినకాడికి దోచుకుని పారిపోయారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సాయంత్రానికి గానీ చోరీ విషయం బయటపడలేదు.
బుధవారం సాయంత్రం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కళావతి ఇంటికి వచ్చి చూసేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. తన ఇంట్లో రూ. 20 వేలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందాక మొదటి అంతస్థులో ఉన్న మహేశ్ ఇంటికి వచ్చాడు. తన ఇంట్లో 10 గ్రాముల బంగారం పోయినట్లు వెల్లడించారు. అతని భార్య నగలన్నీ తీసుకుని పుట్టింటికి వెళ్లడం మంచిదైందన్నారు. పై అంతస్థులో ఉంటున్న అనిల్ ఇంకా పుట్టపర్తిలోనే ఉన్న కారణంగా తన స్నేహితుడు రాజును ఇంటికి పంపించాడు. అతను పరిశీలించగా రూ. 4లక్షలు నగదు, రెండున్నర తులాల బంగారు గొలుసు చోరీకి గురైనట్లు సమాచారం అందించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:చెరువులోకి దూసుకెళ్లిన బస్సు- ఆరుగురు వలస కార్మికులు మృతి