హైదరాబాద్ బాలాపూర్‌లోని ఓ గ్యాస్ ఏజెన్సీ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్యాషియర్ వద్ద ఐదుగురు వ్యక్తులు దోపిడీ చేశారు. వీరిని అరెస్టు చేసిన బాలాపూర్ పోలీసులు నిందితుల నుంచి రూ.1,28,890 నగదు, రెండు గోల్డ్ చైన్స్, 3 ద్విచక్రవాహనాలు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
గ్యాస్ గోదాం క్యాషియర్ వద్ద నగదు దోపిడీ - telangana crime news 2021
గ్యాస్ ఏజెన్సీ నుంచి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్యాషియర్ వద్ద నగదు దోచుకున్న ఘటన హైదరాబాద్ బాలాపూర్‌లో చోటుచేసుకుంది. దోపిడీకి పాల్పడ్డ ఐదుగురు నిందితులను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.
దోపిడీ, గ్యాస్ ఏజెంట్ వద్ద దోపిడీ
ప్రధాన నిందితుడు జక్కుల బాలకృష్ణ గతంలో ఇదే గ్యాస్ గోదాంలో పనిచేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ సంప్రీత్ సింగ్ తెలిపారు. అతని ప్లాన్‌తోనే మిగతా నలుగురు కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించారు.
- ఇదీ చదవండి :మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో రైళ్లు!