తెలంగాణ

telangana

ETV Bharat / crime

Robbery Accused Arrest: దారి దోపిడి ముఠా అరెస్ట్.. పరారీలో మరొకరు - షాద్​నగర్ ఠాణా

లారీ డ్రైవర్లను బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన నిందితులను షాద్​నగర్​ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు ఏసీపీ కుషాల్కర్ వెల్లడించారు. నిందితులంతా మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన వారిగా గుర్తించారు.

Robbery accused arrest
దారి దోపిడీ నిందితుల అరెస్ట్

By

Published : Nov 3, 2021, 5:07 PM IST

లారీ డ్రైవర్లపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ కేసులో మరొకరు పరారీలో ఉన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన ఐదుగురు ఈ దోపిడీకి పాల్పడినట్లు షాద్​నగర్ ఏసీపీ కుషాల్కర్ వెల్లడించారు. అక్టోబర్ 31న తెల్లవారుజామున షాద్​నగర్ పురపాలక శివారులో లారీని అడ్డుకున్న దుండగులు.. ఇద్దరు డ్రైవర్లను బెదిరించి రూ.9 వేల నగదు, సెల్​ఫోన్ ఎత్తుకెళ్లారని ఆయన వెల్లడించారు. షాద్​నగర్ ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలను ఏసీపీ వెల్లడించారు.

సంఘటన జరిగిందిలా...

పాండిచ్చేరి నుంచి పటాన్ చెరువు వైపు వెళ్తున్న లారీ అక్టోబర్ 31 తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో షాద్​నగర్ చేరుకుంది. పట్టణ శివారులోని చౌడమ్మ గుట్ట దేవాలయం సమీపంలోని రీగల్ ఫంక్షన్ హాల్ ఎదుట గల పాత జాతీయ రహదారి వద్దకు రాగానే మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ హుస్సేన్ (31), మహమ్మద్ వసీం (30), మహమ్మద్ ఇబ్రహీం(35), షేక్ ముజాహిద్(26)తో పాటు మరో దుండగుడు డీసీఎంలో వచ్చి లారీని అడ్డుకున్నారు. లారీ డ్రైవర్ పార్థివన్, మరో డ్రైవర్ మురుగన్​పై దాడి చేసి నగదు, సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.

అనంతరం కొత్తూరు వరకు డ్రైవర్లను తీసుకెళ్లిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. డ్రైవర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎస్సై నవీన్ కుమార్ తన బృందంతో కలిసి 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్సైలు సురేష్ యాదవ్, సుందరయ్య, సిబ్బంది శివకృష్ణ , యాదగిరి, శ్రీనివాస్, మోహన్ లాల్, సాయి చంద్ర, ప్రసాద్, రఫీని ఏసీపీ అభినందించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో వారికి రివార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:

Ganjai at shadnagar: గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం​.. పలు చోట్ల అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details