భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇల్లందు పట్టణానికి చెందిన వాస్తు నిపుణులు శంకర్ నాయక్(60) అతని కుమారుడు గణేశ్‌తో కలిసి టేకులపల్లి నుంచి వస్తున్నారు. వారికి ఎదురుగా శ్యాంప్రసాద్ అనే యువకుడు అత్యుత్సాహంతో తన బైక్ ముందు టైర్ పైకి లేపి నడుపుతుండడంతో అదుపుతప్పి... గణేశ్ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో శంకర్ నాయక్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Bike accident: యువకుడి అత్యుత్సాహానికి వృద్ధుడు బలి... - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వార్తలు
ఓ యువకుడి అత్యుత్సాహంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ రేసింగ్ తరహాలో ముందు టైర్ పైకి లేపి నడుపుతూ.. ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వికలాంగ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Road accident
శ్యాంప్రసాద్ అనే యువకుడు బైక్ రేసింగ్ తరహాలో ముందు టైర్ పైకి లేపుతూ... వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. రెండు నెలల క్రితం కూడా ఈ ప్రాంతంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక యువకుడు సైతం చనిపోయినట్లు తెలిపారు. ప్రమాదకరంగా మారిన ఈ మార్గంలో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి:Lorry hits a Bike in Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి