Accident: రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి - రోడ్డు ప్రమాదం
10:23 July 26
రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పూడూరు మండలం మన్నెగూడ కాటన్ మిల్లు వద్ద ప్రమాదం చేటుచేసుకుంది. ఎక్సల్ రాడ్ విరిగి ఎదురుగా వస్తున్న మరో కారుపైకి... కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు మల్లికార్జున్‌రెడ్డి, రాజ్యలక్ష్మి, దేవాన్ష్‌రెడ్డిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శవాగారానికి తరలించారు. ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సంతోష్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఆదివారం వికారాబాద్‌లో ఫంక్షన్‌కు వచ్చి... ఈ రోజు తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:Viral Video: సిలిండర్‌కు కట్టి... ఇనుపచువ్వలతో కొట్టి...