ఆగి ఉన్న ఆర్‌టీసీ బస్సును ద్విచక్రవాహనదారుడు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని గుర్తూర్‌లో జరిగింది. శుక్రవారం ద్విచక్ర వాహనంపై వివాహ శుభకార్యానికి వెళ్లి వస్తున్న ఏర్పుల గణేశ్(21) ఆగిఉన్న ఆర్‌టీసీ బస్సును అర్ధరాత్రి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Accident: నిండు ప్రాణాన్ని బలిగొన్న అతివేగం - telangana news
అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి ఆగిఉన్న ఆర్‌టీసీ బస్సును ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మరొకరికి తీవ్రగాయాలు కావడంతో... స్థానికులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు మృతి