వారంతా ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికులు. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లారు. తమకిష్టమైన కూరగాయలు కొనుక్కున్నారు. సంతోషంగా అక్కడి నుంచి బయల్దేరారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న లారీ కారును ఢీకొట్టి బోల్తా పడింది. అప్పటిదాకా ఆనందంగా గడిపిన వారు చెల్లాచెదురుగా పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా నర్కుడ సమీపంలోని ఇటుక బట్టీల్లో ఒడిశాకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు.
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి - లారీ యాక్సిడెంట్ తాజా వార్తలు
19:00 April 18
శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఆదివారం రోజు కార్మికులు కూరగాయల కోసం లారీలో శంషాబాద్‌కు వెళ్లారు. కూరగాయలు కొనుక్కొని తిరిగి ప్రయాణమయ్యారు. ఇంతలో వారు ప్రయాణిస్తున్న లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మరణించారు. 22 మంది గాయపడ్డారు. ఇందులో ఒక్కరి పరిస్థితి విషమంగా ఉంది.
ఘటన జరిగిన సమయంలో లారీలో సుమారు 50మంది కూలీలు ఉన్నారు. వీరంతా ఒడిశాలోని బలంగిర్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. రోడ్డుకు అడ్డంగా లారీ బోల్తాపడటంతో చాలాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం జేసీబీ సాయంతో లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతులు కలా కుమార్ సునా(20), కృపా సునా(25), గోపాల్ దీప్(25), బుదన్(25), అస్తా యూదవ్(55), పరమానంద్(52)గా గుర్తించారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసుల మృతి.. ఒకరికి గాయాలు