రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలు మృతి చెందిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. సారంగపూర్ మండలం గోపాల్ పేట్‌కు చెందిన బచ్చన్ సింగ్, చంద్రకళలు ఆదిలాబాద్ జిల్లా బజార్ హట్నూర్ మండలం హర్కయిలో ఉండే కూతురు లలిత ఇంటికి వెళ్లారు. ఆనందంగా గడిపారు. అనంతరం మనువరాలు రితిక(04)తో కలిసి ద్విచక్ర వాహనంపై ముగ్గురు బయలుదేరారు.
ROAD ACCIDENT: ఘోర రోడ్డు ప్రమాదం... తాత, మనవరాలు ఆశలు ఆవిరి - telangana news
మనువరాలితో కలిసి ఓ వ్యక్తి సరదాగా గడుపాలనుకున్నాడు. మనువరాలు సైతం తాతయ్యవెంట ఇంటికి వెళ్లి ఆడిపాడి ఆనందంగా గడుపాలనుకుంది. కానీ అంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు తాత, మనవరాలిని పొట్టన పెట్టుకుంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
ఘోర రోడ్డు ప్రమాదం
నెరడిగొండ మండలం వాంకిడి సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బచ్చన్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలతో ఉన్న రితికను నిర్మల్ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ ప్రమాదంతో ఇరుగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:cyber crime: మాయమాటలు చెప్పి... రూ.3 లక్షలు కాజేశారు