నారాయణపేట జిల్లా మరికల్ మండలం అప్పంపల్లి గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరోకరు ఆసుపత్రిలో చికిత్చ పొందుతూ మరణించారు. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
డీసీఎంను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు మృతిచెందగా... ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి కర్ణాటక సరిహద్దులోని స్వగ్రామం ఫుట్‌పాక్ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
డీసీఎంను ఢీకొట్టిన కారు ఒకరు మృతి
ముందు వెళ్తున్న డీసీఎం వ్యానును వెనక నుంచి కారు వేగంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం
Last Updated : Mar 28, 2021, 11:27 AM IST