Gachibowli Road Accident Today : హైదరాబాద్ గచ్చిబౌలిలోని విప్రో కూడలి వద్ద ఓ టిప్పర్ వాహనం బీభత్సం సృష్టించింది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న 3 కార్లు, 3 బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. వాహనాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. ఘటనా స్థలంలోనే స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నాంపల్లికి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ నసీర్ మృతి చెందాడని.. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 3 కార్లు, 3 బైక్‌లు ధ్వంసమయ్యాయని తెలిపారు. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తిసుకున్నామని అన్నారు. నసీర్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని పోలీసులు వివరించారు.