జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మెట్పల్లికి చెందిన కొందరు ఆటోలో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది.
ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి - తెలంగాణ వార్తలు
ఆటోలో దైవదర్శనానికి వెళ్తున్న వారిని కారు ఢీకొట్టిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
ఇదీ చదవండి:ఆకలవుతుందని ఆర్డర్ చేసి.. అవాక్కయ్యారు