YSR district Road accident today: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మలమడుగు శివారులో ఆగివున్న ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్ కింద కూర్చొని కూలీలు భోజనం చేస్తుండగా ఈ ఘటన సంభవించింది.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన టిప్పర్ లారీ.. ముగ్గురు మృతి - accident at jammalamadugu in ysr district
YSR district Road accident today : ఆగి ఉన్న ట్రాక్టర్‌ను టిప్పర్ లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదం
ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన స్థలాన్ని మొత్తాన్ని పరిశీలించి.. అక్కడ ఉన్న వారి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నారు. లారీని సీజ్ చేశారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల వివరాలు కూడా ఇంకా తెలియలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాల్లో, గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చదవండి: