తెలంగాణ

telangana

ETV Bharat / crime

Chittoor Road Accident : లారీని ఢీకొట్టిన కారు.. నలుగురు మృతి - Chittoor Road Accident

Chittoor Road Accident : ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు వేగంగా వెళ్లి లారీని ఢీకొట్టడంతో జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులున్నట్లుగా గుర్తించారు. వీరంతా విశాఖకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

Chittoor Road Accident
Chittoor Road Accident

By

Published : Feb 18, 2022, 1:46 PM IST

Chittoor Road Accident : ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టడం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నట్లు గుర్తించారు.

ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా.. ఆయణ్ను ఆస్పత్రికి తరలించారు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులంతా విశాఖ వాసులుగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details