తెలంగాణ

telangana

ETV Bharat / crime

accident: బైక్​, కారు ఢీ.. ఇద్దరు మృతి - చిత్తూరు జిల్లా కడప క్రాస్ వద్ద రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి న్యూస్

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కడప క్రాస్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

accident news at chittoor
accident: బైక్​, కారు ఢీ.. ఇద్దరు మృతి

By

Published : May 31, 2021, 11:06 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కురబలకోట మండలం కడప క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మోడల్ స్కూల్ సమీపంలో ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఘటనలో.. గుర్రంకొండ మండలం సంఘ సముద్రానికి చెందిన రామ్ కుమార్ (25), పవన్ కుమార్ రెడ్డి (25 ) అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు.

మృతులు బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఉదయాన్నే ద్విచక్ర వాహనంలో బెంగళూరుకు వెళ్తుండగా.. కనిగిరి వైపు వస్తున్న కారు.. వారి ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వచ్చి వేగంగా ఢీకొట్టింది. ఘటనలో చనిపోయిన రామ్, పవన్ మృతదేహాలను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:MP Raghurama: సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్‌పై రఘురామ ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details