మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని చెక్ పోస్టు వద్ద లారీ కింద పడి మహిళ మృతి చెందింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానెపల్లికి చెందిన శ్రీనివాస్, మంజుల (41) ఇద్దరు స్కూటీపై బోయిన్‌పల్లికి వెళ్తున్నారు. చెక్ పోస్టు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఓవర్ టెక్ చేయబోయింది. ఈ క్రమంలో శ్రీనివాస్ సడన్ బ్రెక్ వేయగా బండి స్కిడ్ అయి కింద పడిపోయారు.
కిందపడిన మంజుల పై నుంచి లారీ వెళ్లటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలలో నిక్షిప్తం అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.