నిర్మల్ బంగల్‌పేట్ కాలనీకి చెందిన రాజమణి, తులసీదాస్ దంపతులకు ఇద్దరు కుమారులు. తల్లి బీడీ కార్మికురాలు కాగా, తండ్రి టీ కొట్టు నిర్వహించి ఇద్దరు కుమారులను బాగా చదివించారు. పెద్ద కుమారుడు నాగరాజు మెట్‌పల్లిలో ఉంటున్నాడు. చిన్న కుమారుడైన రాము హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. వయోభారంతో ఆ వృద్ధ దంపతులు పనులు మానేసి ఇంటి వద్దే ఉంటున్నారు.
ఆ దంపతులను విధి వెక్కిరించింది.. హాయిగా బతికేద్దామనుకుంటే..! - హైదరాబాద్ తాజా వార్తలు
కాయకష్టం చేసి ఇద్దరు కుమారులను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. శేషజీవితాన్ని పిల్లలు, మనువళ్లు, మనువరాళ్ల దగ్గర గడిపేద్దామని ఆశగా హైదరాబాద్ వచ్చారు. ఇంతలో రోడ్డు ప్రమాదం వారిని బలితీసుకుంది. కొత్త సంవత్సరం రోజునే ఆ దంపతులు విగతజీవులుగా మారగా..పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Road accident
కొత్త సంతవత్సరం రోజున చిన్నకొడుకు రాము ఇంటికి వచ్చేందుకు హైదరాబాద్ బయలుదేరారు. బోయిన్‌పల్లి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వారిని బస్సు ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన ఆ భార్యాభర్తలు అక్కడికక్కడే చనిపోయారు. కాసేపట్లో కుమారుడి ఇంటికి చేరుకోవాల్సిన వారు కాటికిపోవడంపై బంధువులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు. జీవితాంతం కష్టపడి.. శేష జీవితం హాయిగా గడపాల్సిన దంపతులను ఆ విధి వెక్కిరించిందని నిర్మల్ బంగల్‌పేట్ వాసులు వాపోయారు.
ఇవీ చదవండి: