విశ్రాంత అదనపు ఎస్పీ వోరం భాస్కర్ రావు ( 59 ) అనారోగ్యంతో ఆదివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారు. ఇటీవలే ఆయన కరోనా నుంచి కోలుకున్నారు. ఈయన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక.
అనారోగ్యంతో విశ్రాంత అదనపు ఎస్పీ వోరం భాస్కర్ మృతి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కౌకొండ ఎన్కౌంటర్లో కీలకపాత్ర వహించిన విశ్రాంత అదనపు ఎస్పీ వోరం భాస్కర రావు అనారోగ్యంతో ఆదివారం రోజున కన్నుమూశారు. కొంతకాలం క్రితం కరోనా నుంచి కోలుకున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు.
కరీంనగర్ వార్తలు, విశ్రాంత అదనపు ఎస్పీ వోరం భాస్కర్ రావు, అదనపు ఎస్పీ వోరం భాస్కర్ రావు మృతి
1989 లో పోలీసు శాఖలో ఎస్సైగా ఉద్యోగంలో చేరారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కౌకొండ ఎన్కౌంటర్లో కీలకపాత్ర వహించారు. కరీంనగర్ సీఐడీ విభాగంలో ఏఎస్పీగా పనిచేస్తూ 2020లో పదవీ విరమణ పొందారు. 2003లో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన దాడిపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్లోనూ పని చేశారు.