Woman assaulted in Mahabubabad : ఆధునిక సమాజంలోనూ అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు.. ఓ వ్యక్తి మృతికి కారణమైందని ఆరోపిస్తూ ఓ మహిళను సమీప బంధువులే ఘోరంగా అవమానించిన ఘటన.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ శివారు తండాలో సోమవారం చోటుచేసుకుంది. బంధుగణమే మహిళ అని కూడా చూడకుండా ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. అసలేం జరిగిందంటే..?
వ్యక్తి మృతికి కారకురాలని ఆరోపణ.. మెడలో చెప్పుల దండ వేసి మహిళపై దాడి - డోర్నకల్లో అమానవీయ ఘటన
Woman assaulted in Mahabubabad : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి చిన్న విషయంలో నూతన ఒరవడులతో పయణిస్తున్న సమయమిది. అయినా కొన్ని చోట్ల అనాగరిక అకృత్యాలకు అడ్డుకట్టపడటం లేదు.. ఓ వ్యక్తి మృతికి కారణమైందని ఆరోపిస్తూ సమీప బంధువులే ఓ మహిళను నీచంగా అవమానించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
Inhuman Incident in Mahabubabad : డోర్నకల్ పట్టణ పరిధి మున్నేరు వాగు సమీపంలోని శివాలయం వద్ద ఈ నెల 10న కుళ్లిన స్థితిలో ఉన్న ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం జరిపించారు. మృతుడు డోర్నకల్ శివారు తండావాసిగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి మృతికి కారణమంటూ తండాకు చెందిన ఓ మహిళపై అతడి సమీప బంధువులు దాడి చేశారు. మెడలో చెప్పుల దండవేసి అవమానించారు. దీనిపై డోర్నకల్ సీఐ వెంకటరత్నం వద్ద ప్రస్తావించగా విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. మృతదేహం గుర్తింపు కేసును అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఇవీ చదవండి: