తెలంగాణ

telangana

ETV Bharat / crime

cheating: విజయవాడలో రియల్ మోసం.. రూ.6 కోట్లకు టోకరా - mk constructions and developers cheating

జనాల నుంచి సుమారు రూ.6 కోట్లు వసూలు చేసి ఓ సంస్థ యాజమాన్యం పరారైంది. ఏపీలోని విజయవాడ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేసిన ముఠా.. నగరానికి సమీపంలోని స్థలాలను చూపించి అడ్వాన్సులు తీసుకుని మోసం చేసింది. ముఠా నిర్వాహకులు కార్యాలయానికి రాకపోవడంతో.. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

fraud
విజయవాడలో రియల్ మోసం

By

Published : Jun 12, 2021, 11:36 PM IST

ఏపీలోని విజయవాడలోని నిర్మాణ రంగ సంస్థ ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్ డెవలపర్స్‌ బోర్టు తిప్పేసింది. కొనుగోలుదారుల నుంచి సుమారు ఆరు కోట్ల రూపాయల వరకు అడ్వాన్సులు వసూలు చేసి గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, వైజాగ్‌కు చెందిన సుమారు వంద మంది లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చారు. ఏజెంట్ల ద్వారా బుకింగ్స్‌ చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్ల కోసం పట్టుబట్టారు. దీంతో మార్చి నుంచి సంస్థ నిర్వాహకులు కార్యాలయానికి తమ రాకపోకలను తగ్గించారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తంగా 100 మంది కస్టమర్ల నుంచి అడ్వాన్సు నగదు తీసుకున్నట్లు బాధితులు తెలిపారు.

అసలేం జరిగింది..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు గత ఏడాది ఆగస్టులో విజయవాడ కేంద్రంగా రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలోనూ ఈ సంస్థకు బ్రాంచీలున్నట్లు బాధితులు తెలిపారు.

ఈ కంపెనీకి విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామానికి చెందిన ఉప్పు మనోజ్‌కుమార్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. యద్దనపూడికి చెందిన బలగం రవితేజ డైరెక్టరుగా ఉన్నారు. ఈ సంస్థ అభివృద్ధి చేసే స్థలాలు, నిర్మించే గేటెడ్‌ కమ్యూనిటీల్లో విల్లాలను విక్రయించడానికి విజయవాడలోని మొత్తం 20 మంది యువకులను ఏజెంట్లుగా నియమించుకుంది. విక్రయించిన ప్లాట్లలో వారికి రెండు శాతం కమీషన్‌ ఇస్తామని నమ్మించారు.

ఖాళీ చెక్కులను హామిగా ఇచ్చి నమ్మించి..

పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్‌, రవితేజ కలిసి ఈ ఏజెంట్లకు విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం, ముస్తాబాద, ఆగిరిపల్లిలో ఉన్న స్థలాలను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు వెంచర్లను ఏజెంట్లకు చూపించారు. ఈ స్థలాలను చూసిన ఏజెంట్లు బుకింగ్స్‌ తీసుకొచ్చారు. కొంతమంది ఏజెంట్లు ముందుగా పెట్టుబడి పెట్టి అడ్వాన్సులు ఇచ్చారు. ఖాళీ చెక్కులను హామీగా ఇచ్చారు. ఆఫర్లు ప్రకటించారు. దీంతో పలువురు కస్టమర్లు అడ్వాన్సులు చెల్లించారు. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, వైజాగ్‌కు చెందిన సుమారు వంద మంది లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చారు. చివరగా మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. కష్టపడి పడి సంపాదించిన సొమ్మంతా దోచుకెళ్లారని బాధితులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:ETALA: 'డబ్బు సంచులకు, ఆత్మగౌరవానికి పోరాటం'

ABOUT THE AUTHOR

...view details