డబ్బు ఆశ చూపి మతిస్థిమితం సరిగ్గా లేని మైనర్ బాలికపై అత్యాచారానికి (Minor Girl Rape) పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాల్కల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన 46 ఏళ్ల దస్తగిరి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
మతిస్థిమితం లేని బాలికతో దస్తగిరి ఇంట్లో ఉండడాన్ని గుర్తించిన స్థానికులు... బాధితురాలి కుటుంబీకులకు హద్నూర్ పోలీసులకు సమాచారం అందించారు. బాధితురాలిని హద్నూర్ పోలీసులు వైద్య పరీక్షల కోసం సంగారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యాచార (Minor Girl Rape) ఘటన తెలుసుకున్న జహీరాబాద్ డీఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.