తెలంగాణ

telangana

ETV Bharat / crime

కూల్​డ్రింక్స్​లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం.. - సూర్యాపేట జిల్లాలో దారుణం

కూల్​డ్రింక్స్​లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం..
కూల్​డ్రింక్స్​లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం..

By

Published : Apr 18, 2022, 3:06 PM IST

Updated : Apr 18, 2022, 5:29 PM IST

15:03 April 18

కూల్​డ్రింక్స్​లో మత్తుమందు కలిపి మూడ్రోజులుగా యువతిపై అత్యాచారం..

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ కాలనికి చెందిన యువతిపై శీతలపానీయంలో మత్తు ఇచ్చి గత మూడు రోజులుగా ఇద్దరు నిందితులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో బయటకు రాగా.. ఇద్దరు యువకులు ఆటోలో శివారు ప్రాంతానికి తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చి గత మూడు రోజులుగా అత్యాచారం చేసినట్లు యువతి పేర్కొంది.

మత్తుతో స్పృహ తప్పి పడి ఉన్న తనపై చిత్రహింసలకు పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. తలపై, కాళ్లపై నిందితులు దాడి చేశారని.. దాంతో స్పృహ లేకుండా అలాగే పడి ఉన్నానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఆ ఇద్దరు నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను వేడుకుంది. ఆదివారం సాయంత్రం స్పృహతప్పి పడి ఉన్న తనను గమనించిన స్థానికులు అనుమానం వచ్చి బంధువులకి సమాచారం అందించారని బాధితురాలు తెలిపింది.

బంధువులు, పోలీసువారి సహాయంతో ఆమెను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం పట్టణ పోలీసులకు బంధువులు ఫిర్యాదు చేశారు. ఘటనపై సీఐ నరసింహారావును వివరణ కోరగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వైద్య పరీక్ష కోసం శాంపిల్స్​ను సూర్యాపేటకు పంపినట్లు తెలిపారు. ఈ ఘటనలోని నిందితుల్లో కోదాడ మున్సిపాలిటీ తెరాస కౌన్సిలర్ కుమారుడు కూడా ఉన్నారు.

ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని బాధితురాలి తల్లి వేడుకుంటున్నారు. పలువురి ఇండ్లలో పనిచేసుకుంటూ పిల్లలను పెంచానని ఆమె వాపోయింది. గత మూడు రోజుల నుంచి తమ కూతురి కోసం వెతుకుతున్నామని ఆమె చెప్పారు. ఆదివారం రాత్రే తమకు ఈ విషయం తెలిసిందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

ఇవీ చదవండి:

Last Updated : Apr 18, 2022, 5:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details