బాలికపై అత్యాచారానికి యత్నించిన జీహెచ్ఎంసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి తల్లిని తప్పుదోవ పట్టించి.. ఈ ఘాతుకానికి యత్నించాడు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి మహదేవపురంలో ఉన్న జంతు సంరక్షణ కేంద్రం(animal care center) షెల్టర్ మేనేజర్‌గా (ఒప్పంద ప్రాతిపదికన) భాస్కర్‌రావు పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సంరక్షణ కేంద్రంలోనే నివాసం ఉంటున్నాడు. ఆ కేంద్రానికి కాపాలాదారుగా పనిచేస్తున్న మహిళ తన కుమార్తెతో కలిసి అక్కడే ఉంటోంది. అక్కడే జంతువుల బాగోగులు చూసే వ్యక్తిగా తరుణ్ పనిచేస్తున్నాడు. తరుణ, కాపాలాదారు మహిళ నివాసానికి కామన్ బాత్రూమ్ ఉంది.
ఈ ఉదయం బాలిక తల్లిని.. వేరే పని పురమాయించాడు షెల్టర్ మేనేజర్ భాస్కరరావు. ముందస్తు పథకం ప్రకారం.. బాత్రూమ్లో దాక్కున్నాడు. బాలిక బాత్రూమ్లోకి వెళ్లగానే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఒక్కసారి షాక్‌కు గురైన బాలిక కేకలు వేస్తూ బయటకు వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. భాస్కరరావుపై ఫిర్యాదుచేసేందుకు తల్లీ కుమార్తె జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ వెళ్లిన సమయంతో నిందితుడు బెదిరింపులకు పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయాలంటూ తోటి ఉద్యోగాలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.