ఆర్ఎంపీ వైద్యునిగా సరైన సంపాదన లేకపోవడం వల్ల ఓ వ్యక్తి దొంగ అవతారం ఎత్తాడు. ఆర్టీసీ బస్సులను టార్గెట్ చేసి సొత్తు కాజేస్తున్నాడు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులలో ప్రయాణిస్తూ దొంగతనాలకు (Theft on RTC bus) పాల్పడుతున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం పనామాక్రాస్రోడ్ వద్ద అరెస్టు చేశారు(Vanasthalipuram police arrested a thief). నిందితుడు ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం లక్ష్మీదేవునిపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు (rmp doctor) నవీన్‌కుమార్‌గా గుర్తించారు.
ఇలా దొరికాడు...
గత నెల 8న నరసరావుపేట నుంచి ఎల్బీనగర్కు ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ ప్రయాణికుడు... తన బ్యాగును గుర్తు తెలియని వ్యక్తి దొంగలించి ఆటోనగర్ వద్ద బస్సు దిగి వెళ్లిపోయాడని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న వనస్థలిపురం పోలీసులు, ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసుల సహాయంతో మంగళవారం ఉదయం 6 గంటలకు వనస్థలిపురం పనామా క్రాస్‌రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.5లక్షల విలువైన 16 ల్యాప్‌టాప్‌లు, 5 సెల్‌ఫోన్‌లు, 2 పవర్ బ్యాంక్‌లు, రిస్ట్‌వాచ్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:Theft in jewellery shop : జ్యువెల్లరీ షాపులో దొంగతనం.. 5 కిలోల వెండి ఆభరణాలు మాయం