తెలంగాణ

telangana

ETV Bharat / crime

కుంటలో రెండేళ్ల బాలుడి మృతదేహం.. ప్రమాదమా.? హత్యా.?

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతమైంది. సమీపంలోని ఓ కుంటలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారిని హత్య చేసి కుంటలో పడేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

dead body of two years old boy in pond
కుంటలో రెండేళ్ల బాలుడి మృతదేహం

By

Published : Aug 28, 2021, 4:20 PM IST

Updated : Aug 28, 2021, 4:37 PM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో రెండేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. సమీపంలోని ఓ కుంటలో అనుమానాస్పద స్థితిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జలాల్​బాబా నగర్​లో నివాసముంటున్న అబ్దుల్ రహీం, తబస్సుమ్ దంపతు​ల కుమారుడు బాబు బాకర్.. శుక్రవారం సాయంత్రం నుంచి కనబడకుండా పోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చిన్నారి కోసం రెండో రోజు తల్లిదండ్రులు, పోలీసులు గాలిస్తుండగా.. సమీపంలోని కుంటలో చిన్నారి మృతదేహం కనిపించింది. విగతజీవిగా బాలుడిని చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారిని హత్య చేసి చెరువులో పడేసి ఉంటారని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:MALLAREDDY: 'రేవంత్ బ్లాక్​మెయిల్ కొత్తేమీకాదు.. అప్పట్లోనే చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లా'

Last Updated : Aug 28, 2021, 4:37 PM IST

ABOUT THE AUTHOR

...view details