సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎల్ఎక్స్ వాహనాలు తక్కువ ధరకు విక్రయిస్తామంటూ మోసాలకు తెరలేపారు. అలాగే అందమైన అమ్మాయిల ఫొటోలు, న్యూడ్ వీడియోస్ పంపుతూ బ్లాక్ మెయిల్ దందా కొనసాగిస్తున్నారు.
రాజస్థాన్‌లోని అవెర్ జిల్లాకు చెందిన పదిమంది ముఠా సభ్యులను పీటీ వారెంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు నగరానికి తీసుకొచ్చారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. గతంలో రాజస్థాన్ పోలీసుల చేతిలో అరెస్టైన ఈ ముఠా సభ్యులు ఇప్పటికే అవెర్ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.