హైదరాబాద్‌లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 25 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలు, రూ. 36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు - rachakonda commissionerate latest news
పగటి వేళలో కారులో తిరుగుతూ తాళం వేసిఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు సహా రూ. 36 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ పీఓటీ మార్కెట్లో అనుమాదాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను మల్కాజిగిరి సీసీఎస్, నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో తాము మూడు ఇళ్లలో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. నిందితులు పగటి సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి.. ఇనుపరాడ్డుతో తలుపులు బద్దలు కొట్టి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. హబ్సీగూడలో చోరికి గురైన తమ ఆభరణాలను తిరిగి అప్పజెప్పినందుకు ఓ ఇంటి యజమాని సీపీ మహేష్ భగవత్‌ను కలసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి:ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం