తెలంగాణ

telangana

ETV Bharat / crime

సీరియల్‌ కిల్లర్: మహిళలే లక్ష్యం... 18 దారుణ హత్యలు! - సైకో కిల్లర్ వార్తలు

18 మందిని హత్యచేసిన సీరియల్‌ కిల్లర్‌ కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని హైదరాబాద్​ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. నిందితుడు 2003 నుంచి వరుస నేరాలకు పాల్పడ్డాడని... అన్ని ఘటనల్లోనూ మహిళలే బాధితులని పేర్కొన్నారు.

psycho  killer
psycho killer

By

Published : Jan 26, 2021, 3:55 PM IST

Updated : Jan 26, 2021, 5:35 PM IST

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్​ను ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 16మంది మహిళలను హత్య చేసి జైలుకు వెళ్లి బయటికొచ్చిన మైన రాములు.. మరో రెండు హత్యలు చేశాడు. మొత్తం 18 హత్యలు చేసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్​గా మారిన రాములును... ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

ఆ కేసుతో వెలుగులోకి

ఈ నెల 4న ఘట్​కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఘట్​కేసర్ పోలీసులు జూబ్లీహిల్స్​లోని వెంకటగిరి కాలనీకి చెందిన వెంకటమ్మగా గుర్తించారు. ఘట్​కేసర్ పోలీసులతో పాటు... ఉత్తర మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు కూడా సమాంతర దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ఓ వ్యక్తితో కలిసి ఈ నెల 4వ తేదీన ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు.

జైలు నుంచి వచ్చి మరో రెండు హత్యలు

సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఫొటోను సేకరించిన పోలీసులు... పాత నేరస్థుడిగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన ఐన రాములు... మహిళలపై ద్వేషంతోనే హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో 16 హత్యలు, 4 దొంగతనాలు చేసిన రాములు... గతేడాది జులైలో జైలు నుంచి బయటికి వచ్చి మరో రెండు హత్యలు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అన్ని ఘటనల్లోనూ మహిళలే బాధితులని చెప్పారు. భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని వివరించారు.

సీరియల్‌ కిల్లర్: మహిళలే లక్ష్యం... 18 దారుణ హత్యలు!

ఇదీ చదవండి :మహిళలను చంపిన సైకో... పట్టించిన చిన్న చీటీ

Last Updated : Jan 26, 2021, 5:35 PM IST

ABOUT THE AUTHOR

...view details