సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నిషేధిత గుట్కా పట్టుబడింది. సీజ్ చేసిన సరుకు విలువ సుమారు రూ.14లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితుల నుంచి ఓ కారు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
దోరకుంట సమీపంలో భారీగా పట్టుబడిన నిషేధిత గుట్కా - తెలంగాణ వార్తలు
సూర్యాపేట జిల్లా దోరకుంట సమీపంలో అక్రమంగా తరలిస్తన్న నిషేధిత గుట్కాను పోలీసులు సీజ్ చేశారు. దీని విలువ రూ.14లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఈ సంఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
నిషేధిత గుట్కా సీజ్, నిషేధిత గుట్కాని సీజ్ చేసిన పోలీసులు
పాలడుగు శ్రీకాంత్, ఎర్ర శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు విజయవాడలో లక్ష గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్నారని కోదాడ రూరల్ ఎస్సై సైదులు వెల్లడించారు. కోదాడ, హుజూర్నగర్ పరిసర ప్రాంతాల్లో విక్రయించడానికి వెళ్తుండగా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఏటీఎం వద్ద కాల్పుల కేసులో ఒకరు అరెస్ట్.. ఇంకొకరు పరార్!