వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తోంది. మహమ్మారి బారిన పడిన ఓ నిండు గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చి మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన వర్ధన్నపేట మండలం కట్రాల గ్రామంలో చోటుచేసుకుంది. గత పది రోజుల క్రితం నిండు గర్భిణి పాముల మౌనిక(21)కి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఇంటివద్దే ఉంటూ చికిత్స పొందింది.
బిడ్డకు జన్మనిచ్చి.. కరోనాతో తల్లి మృతి
వరంగల్ గ్రామీణ జిల్లా కట్రాలలో కరోనా సోకి ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఆడ శిశువుకు జన్మనిచ్చి మృత్యువాత పడింది. మౌనిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బిడ్డకు జన్మనిచ్చి.. కరోనాతో తల్లి మృతి
ఈ క్రమంలోనే మౌనికకు పురిటి నొప్పులు రావడంతో వరంగల్ సీకేఎం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ నిర్వహించగా ఆడ శిశువు జన్మించింది. అనంతరం మౌనిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ చికిత్సపొందుతూ ఈ తెల్లవారు జామున మృతి చెందింది. మౌనిక మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి :రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు