తెలంగాణ

telangana

ETV Bharat / crime

కరీంనగర్​లో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ కేసు సుఖాంతం - కరీంనగర్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ వార్తలు

Karimnagar Kidnap Case: కరీంనగర్ జిల్లాలో ఇద్దరు చిన్నారుల అపహరణ కేసు సుఖాంతమైంది. మంకమ్మ తోటలో కిడ్నాప్‌ అయిన వారిని.. మహారాష్ట్రలోని జాల్నా రైల్వేస్టేషన్​లో గుర్తించి రక్షించారు. పిల్లలను కరీంనగర్​కు తీసుకువచ్చిన పోలీసులు.. వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

Karimnagar district
Karimnagar district

By

Published : Feb 4, 2023, 7:18 PM IST

Karimnagar Kidnap Case: పక్కింటిలో ఉండే మహిళ షాపింగ్ తీసుకువెళతానంటే ఆ ఇద్దరు చిన్నారులు సరే అన్నారు. ఆమె వెంట వారు ప్రయాణమయ్యారు. కానీ ఇక్కడే ఓ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. అలా తీసుకెళ్లిన సదరు మహిళ వారిని కొట్టడం ప్రారంభించింది. ఇది గమనించిన రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కరీంనగర్ జిల్లాలో మంకమ్మ తోట ఇద్దరు చిన్నారుల కిడ్నాప్‌కు కేసును పోలీసులు చేధించారు. మహారాష్ట్రలోని జాల్నా రైల్వేస్టేషన్​లో వారిని గుర్తించారు. పొరుగింట్లో ఉండే జయశ్రీ ఇద్దరు చిన్నారులను షాపింగ్‌కు తీసుకెళతానని మభ్యపెట్టి.. ఈనెల ఒకటో తేదీన ఇంటి నుంచి తీసుకెళ్లెంది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఇద్దరు చిన్నారుల కోసం.. వెతకడం ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు వారిని షాపింగ్‌కు తీసుకెళ్లి జయశ్రీ ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలోనే ఇద్దరు పిల్లలను తీసుకెళ్లిన జయశ్రీ మహారాష్ట్రలోని జాల్నా రైల్వేస్టేషన్​లో ఇద్దరిని కొట్టి.. వారి వద్ద ఉన్న సెల్​ఫోన్‌ పగుల గొట్టింది. దీనిని గమనించిన అక్కడి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ పోలీసులు వారి గురించి ఆరాతీశారు. ఈ సమాచారాన్ని కరీంనగర్​ పోలీసులకు అందించారు. వారు వెంటనే చిన్నారుల తల్లిదండ్రులతో అక్కడికి చేరుకొని కరీంనగర్‌కు తరలించారు. కిడ్నాప్ చేసిన మహిళపై కేసు నమోదు చేయించినట్లు స్త్రీశిశుసంక్షేమశాఖ అధికారి శాంత తెలిపారు. తమ పిల్లలను క్షేమంగా అప్పగించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు సురక్షితంగా అప్పగించిన తమ వారిని చేతుల్లోకి తీసుకున్న కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలు రాల్చారు. నిందితురాలని పోలీసులు రిమాండ్​కు తరలించారు.

"మా పిల్లలను ఇంటి దగ్గర ఉంచాం. మా చిన్నారులను తీసుకెళ్లి ట్రైన్ ఎక్కించింది. వారిని అక్కడికి తీసుకెళ్లి కొట్టడం చేసింది. రైల్వే పోలీసులు గుర్తించి వారి గురించి వివరాలు అడిగారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లి మా చిన్నారులను తీసుకువచ్చాం."- సురేశ్, తండ్రి

"మాకు ఈ కిడ్నాప్ విషయంపై మహారాష్ట్ర పోలీసులు సమాచారం ఇచ్చారు. జయశ్రీ అనే మహిళ పిల్లలను తీసుకువచ్చిందని చెప్పారు. వారిని అక్కడి నుంచి తలిదండ్రులకు అప్పగించాం." -శాంత, స్త్రీశిశు సంక్షేమ అధికారిణి కరీంనగర్‌

ఇవీ చదవండి:హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ప్లైవుడ్ గోదాంలో చెలరేగిన మంటలు

ఇద్దరు పిల్లలను బావిలో తోసి.. తండ్రి ఆత్మహత్య

'ముంబయిలో ఉగ్రదాడులు చేస్తాం'.. ట్విట్టర్ వేదికగా మరోసారి వార్నింగ్​.. భయపడొద్దన్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details