సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల స్కాంలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భారీ మొత్తంలో విత్తనాలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసి 15 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు తుంగతుర్తి సీఐ రవి కుమార్ చెప్పారు. ఐదు రోజుల క్రితం నకిలీ విత్తనాలను విక్రయిస్తున్న ముగ్గురిని అర్వపల్లి పరిధిలో అరెస్ట్ చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లోని వనస్థలీపురం, ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీ ఎత్తున వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించి భారీగా నకిలీ విత్తనాలు సీజ్ చేశారు.
counterfeit seeds: సూర్యాపేట జిల్లాలో మరో 15లక్షల విలువైన నకిలీ విత్తనాలు పట్టివేత
నకిలీ విత్తనాలను విక్రయించేవారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తిలో 15 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేశామన్న తుంగతుర్తి సీఐ అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల పట్టివేత
నకిలీ విత్తనాల తయారు చేసిన దుండగులు జిల్లాల్లోని ఏజెంట్ల సహాయంతో రైతులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. రైతులు లైసెన్స్లు పొందిన అమ్మకందారుల వద్దనే విత్తనాలను కొనాలని సీఐ రవి కుమార్ సూచించారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేశామన్న ఆయన ఇలాంటి వారిపై కఠిన చ్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఎస్‌ఐ అన్యాయం చేశాడంటూ... సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్‌చల్